TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

సైనికుడి చేయి పట్టుకుని నడిచిన మెలానియా!ట్రంప్ తో తెగతెంపులేనా? 

Published on: Fri Nov 13, 2020 2:51PM

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన డొనాల్డ్ ట్రంప్ కు షాకుల మీద షాకుల తగులుతున్నాయి. ఆయన వైవాహిక జీవితం విచ్ఛిన్నం దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ట్రంప్ నుంచి మెలానియా విడాకులు తీసుకోనుందనే వార్తలు పెద్ద ఎత్తున ప్రచారమవుతున్నాయి. ఆ వార్తలకు బలం చేకూరేలా ప్రవర్తిస్తున్నారు మెలానియా. వెటరన్స్ డే సందర్భంగా ట్రంప్ కు షాకిచ్చేలా ఆమె వ్యవహరించారు. 

 

వెటరన్స్ డే సందర్భంగా తన భార్య మెలానియాతో కలిసి ఆర్లింగ్టన్ జాతీయ శ్మశానవాటికను సందర్శించారు ట్రంప్. అయితే అక్కడ ఊహించని ఘటన జరిగింది. తన భర్తతో కలిసి నడవకుండా.. ఓ సైనికుడి చేయి పట్టుకుని మెలానియా నడిచింది. మెలానియా ప్రవర్తించిన తీరు అందరినీ షాక్ కు గురి చేసింది. ఈ ఘటనతో అక్కడి వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. దీంతో వీరిద్దరూ విడిపోనున్నారనే వార్తకు మరింత బలం వచ్చింది. జనవరిలో ట్రంప్ అధ్యక్షపీఠం నుంచి వైదొలగగానే వీరి వివాహబంధం ముగుస్తుందని చెపుతున్నారు.

 

అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినా.. ఓటమిని అంగీకరించడం లేదు ట్రంప్. న్యాయపోరాటం చేస్తానని చెబుతున్నారు. వైట్ హౌజ్ నుంచి ఖాళీ చేయడానికి మొండికెస్తున్నారు. ఓటమిని ఒప్పుకోమని మెలానియా చెప్పినా ట్రంప్ వినడం లేదని తెలుస్తోంది. దీంతో ట్రంప్ తీరుపై మెలానియా అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. గతంలోనూ వీరిద్దరి మధ్య విభేదాలున్నాయని ప్రచారం జరిగింది. అయితే అమెరికా ఫస్ట్ లేడీగా ఉన్నందున ట్రంప్ తో విడిపోయేందుకు మెలానియా ఇష్టపడలేదని చెబుతున్నారు. ఇప్పుడు ప్రెసిడెంట్ పదవి పోయినందున ట్రంప్ కు టాటా చెప్పేందుకు మెలానియా నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది.