TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైట్‌హౌస్‌లో కాలు పెట్టనున్న ట్రంప్ భార్య..గొడవలు లేనట్లేనా...?

Published on: Sun Jun 11, 2017 2:20PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ మరికొద్ది రోజుల్లో వైట్‌హౌస్‌లో కాలు పెట్టనున్నారు. అదేంటి ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారా..? ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి ఆమె శ్వేతాసౌధానికి రాలేదు. కేవలం ట్రంప్ మాత్రమే అక్కడ ఒంటరిగా ఉంటున్నారు. మెలానియా వైట్‌హౌస్‌కి రాకపోవడం వెనుక కారణం లేకపోలేదు. కుమారుడి చదువు బాధ్యతలు చూస్తోన్న ఆమె న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్స్‌లో నివసిస్తున్నారు. కాగా, ఇటీవలి సౌదీ, రోమ్ తదితర ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా ఇద్దరి ప్రవర్తన చూసి వీరి మధ్య విభేదాలు ఉన్నట్లు అంతా భావించారు. రోమ్‌లో విమానం దిగుతుండగా ట్రంప్ చెయ్యి అందించినా, దాన్ని అందుకోకుండా మెలానియా మొండిగా వ్యవహరించడంతో ప్రపంచం నివ్వెరపోయింది. ఈ నేపథ్యంలో ఆమె శ్వేతాసౌధానికి రానుండటంతో మెలానియాకు ఘనస్వాగతం పలికేందుకు సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు.