జగన్ కేబినెట్ లో మహిళా హోంమంత్రి.. ఆమేనా?

 

ఏపీ సీఎం వైఎస్ జగన్ తనదైన తరహాలో కేబినెట్‌ కూర్పు చేస్తున్నారు. ఏపీ కేబినెట్‌లో 25 మందికి చోటు దక్కనుంది. వారిలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉంటారని ఇప్పటికే ప్రకటించేశారు. హోంమంత్రి పదవి కూడా ఓ మహిళకు ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో హోంమంత్రిగా అప్పటి చేవెళ్ళ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పనిచేసిన విషయం తెలిసిందే. జగన్ కూడా తండ్రి బాటలోనే హోంమంత్రిగా ఓ మహిళకే అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎవరు హోంమంత్రి అవుతారనే చర్చ ప్రారంభమైంది. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి 12 మంది మహిళా ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అందులో రోజా, మేకతోటి సుచరిత లాంటి వారు వైఎస్ కుటుంబానికి అంత్యంత సన్నిహితులు. వారిలో ఎవరికి హోంమంత్రి పదవి దక్కుతుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే హోంమంత్రిగా మేకతోటి సుచరితని నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు:

రెడ్డి శాంతి (పాతపట్నం)
కళావతి (పాలకొండ)
పుష్ప శ్రీవాణి (కురుపాం)
ధనలక్ష్మి (రంపచోడవరం)
భాగ్యలక్ష్మి (పాడేరు)
తానేటి వనిత (కొవ్వూరు)
ఉండవల్లి శ్రీదేవి (తాడికొండ)
మేకతోటి సుచరిత (పత్తిపాడు)
విడుదల రజిని (చిలకలూరిపేట)
కంగాటి శ్రీదేవి (పత్తికొండ)
ఆర్కే రోజా సెల్వమణి (నగరి)
జొన్నలగడ్డ పద్మావతి (శింగనమల)