ఎంపీ మేకపాటి రాజీనామాకు ఒకే చెప్పిన స్పీకర్
Published on: Wed Feb 29, 2012 3:59PM
న్
యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి రాజీనామాను లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ ఆమోదించారు. తాను రాజీనామాకు కట్టుబడి ఉన్నానని రాజమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో ఆమె మేకపాటి రాజీనామాను బుధవారం ఆమోదించారు. దీంతో నెల్లూరు లోకసభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.సీబీఐ చార్జిషీట్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును చేర్చడాన్ని నిరసిస్తూ మేకపాటి లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా సమర్పించిన సంగతి తెలిసిందే.


