TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎన్నికల దిశగా జమ్ము కశ్మీర్?

Published on: Mon Feb 1, 2016 5:18PM

జమ్ము కశ్మీర్ ఎన్నికల దిశగా అడుగులేస్తోందా? పీపుల్స్ డెమాక్రటిక్ పార్టీ (పీడీపీ) వైఖరి ఈ ఊహాగానాలకు తెర తీసింది.  రాష్ట్ర్ర ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ ఆకస్మిక మృతి చెంది మూడు వారాలు గడుస్తున్నా రాష్ట్ర్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. కావాలనుకుంటే ముఖ్యమంత్రి కావడం తనకు 10 నిముషాల పని అని పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తి అంటున్నారు.. అంటున్నారే కానీ ఆ దిశగా ఏ మాత్రం చొరవ తీసుకోడం లేదు. సయీద్ కుమార్తె అయిన మెహబూబా తమ అలయన్స్ భాగస్వామి బీజేపీ మీద అపనమ్మకాన్ని వ్యక్తం చేస్తూ కూడా మాట్టాడుతున్నారు. తన తండ్రి సయీద్ శాంతి కోసం సామరస్యం కోసం కలలు కన్నారని ఆయన కలలు ఇక మీదట కూడా నెరవేరతాయని తాననుకోడం లేదని మెహబూబా వ్యాఖ్యానించారు. తనకు ఈ విషయంలో బీజేపీపై నమ్మకం కుదిరితేనే తాను సీఎం పీఠం ఎక్కుతాననంటున్నారు. దీంతో అలయన్స్  అపనమ్మక సంక్షోభంలో కూరుకుపోయినట్లు స్పష్టం అవుతోంది.

అయితే ఆమె మనసులో వేరేదో భావన ఉందని పరిశీలకులు అనుమానిస్తున్నారు. జనవరి 31 సమావేశంలో ఒక స్పష్టత వస్తుందని భావించారు. కానీ కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఏం తేలలేదు. ఇలా ఉండగా, పీడీపీ నాన్చుడు వ్యవహారంతో బీజేపీలో అసహనం పెరిగిపోతోంది. మరోవైపు ప్రతిపక్ష నేషనల్ కాన్ఫరెన్స్ కూడా పీడీపీ వైఖరిని తీవ్రంగా దుయ్యబడుతోంది. ఇది రాజ్యాంగాన్ని పరిహసించడమే అని ఆ పార్టీ అధినేత ఇక గవర్నర్ కూడా జాప్యంతో విసిగిపోయారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా లేదా అంటూ పీడీపీ బీజీపీలను నిలదీశారు. పీడీపీ చీఫ్ మెహబూబాను, బీజేపీ రాష్ట్ర  అధినేత సత్పాల్ శర్మలను మంగళవారం తనను కలవాలని హుకుం జారీ చేశారు. ఈ సమావేశం తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.