TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

మేఘాలయలో ఘోర రోడ్డుప్రమాదం..16 మంది దుర్మరణం

Published on: Sun Feb 26, 2017 3:39PM

మేఘాలయలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వెస్ట్ ఖాసి హిల్స్‌ జిల్లాలో ట్రక్కులో చర్చికి వెళ్తుండగా అది అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 16 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించాయి. వారిలో కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో ట్రక్కులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు.