TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌కు సీరియస్ 

Published on: Fri Sep 10, 2021 10:18PM

మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.  స్పోర్ట్స్‌ బైక్‌పై ప్రయాణిస్తున్న ఆయన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి సమీపంలో ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. ఈ ఘటనలో సాయిధరమ్‌ తేజ్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సాయితేజ్‌ అపస్మారక స్థితిలో వెళ్లారు. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద ప్రాంతానికి చేరుకుని, చికిత్స నిమిత్తం సాయిధరమ్‌ తేజ్‌ను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. చికిత్స తర్వాత సాయి ధరమ్ తేజ్ సృహలోకి వచ్చారని, ప్రమాదం ఏమి లేదని డాకర్టు చెప్పినట్లు తెలుస్తోంది. 

జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 నుంచి గచ్చిబౌలి వైపు వెళుతుండగా సాయి ధరమ్ తేజ్ బైక్.. కేబుల్ బ్రిడ్జి తర్వాత కోహినూర్ హోటల్ వద్ద స్కిడ్ అయింది. ప్రమాదం సమయంలో బైక్ అతి వేగంగా ఉండటంతో సాయి ధరమ్ తేజ్ కడుపు, ఛాతీ, కుడికన్నుపై గాయాలయ్యాయి. 

బైక్‌పై వేగంగా వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. బైక్‌ను నియంత్రించలేక అదుపుతప్పి కిందపడిపోయినట్లు మాదాపూర్‌ సీఐ తెలిపారు. అంతర్గతంగా ఏమైనా గాయాలు అయ్యాయా?అన్న అనుమానంతో సాయిధరమ్‌ తేజ్‌కు వైద్యులు స్కాన్‌ చేస్తున్నారని, ప్రమాద వార్తను కుటుంబ సభ్యులకు తెలియజేసినట్లు సీఐ వివరించారు.