త్రిషకు మెగా ఫ్యామిలీ నుంచి సమ్మర్ స్పెషల్ గిఫ్ట్
Published on: Wed Jun 3, 2026 7:01PM

దక్షిణాది స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్‌కు మెగా ఫ్యామిలీ నుంచి ప్రత్యేక మైన సమ్మర్ సర్‌ప్రైజ్ అందింది. మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసనా కామినేని కొణిదెల నిర్వహిస్తున్న ‘అత్తమ్మాస్ కిచెన్’ నుంచి త్రిషకు ప్రత్యేక గిఫ్ట్ హ్యాంపర్ పంపించారు. ఈ హ్యాంపర్ లో సంప్రదాయ ఆంధ్ర రుచులను గుర్తు చేసే ఆవకాయ పచ్చళ్లతో పాటు వివిధ రకాల పొడులు, ఇంటి వంటలకు ఉపయోగపడే ప్రత్యేక పదార్థాలు ఉన్నాయి.
ఈ బహుమతిని అందుకున్న త్రిష తన ఆనం దాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ, “నిజంగా వేసవి వచ్చినట్లు అనిపిస్తోంది” అని పేర్కొంది. అంతేకాకుండా, ఈ ప్రత్యేక గిఫ్ట్‌ను పంపిన ఉపాసనకు ధన్యవాదాలు తెలియజేస్తూ తన అభిమానాన్ని వ్యక్తం చేసింది. సంప్రదాయ తెలుగు రుచులను సెలబ్రిటీలకు చేరవేస్తూ ‘అత్తమ్మాస్ కిచెన్’ మరో సారి అందరి దృష్టిని ఆకర్షించింది.


