TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నిండు గర్భిణీ భార్యను ముక్కలుగా... నరికి చంపిన కసాయి భర్త

Published on: Sun Aug 24, 2025 11:10AM

 

ఓ భర్త గర్భిణీతో ఉన్న భార్యను అతి దారుణంగా హత్య చేయడమే కాకుండా ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి కవర్లో వేసి ఎక్కడెక్కడో పడేసి... పోలీసులు చేతికి చిక్కకుండా తప్పించుకోవాలని ప్రయత్నించాడు... ఈ ఘటన రాచ కొండ కమిషనరేట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడ కి చెందిన స్వాతి(22 అలియాస్ జ్యోతి) అనే యువతి...అదే గ్రామానికి చెందిన సామల మహేందర్ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నది.

ఈ ప్రేమ జంట జీవనోపాధి కొరకు గత 25 రోజుల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చి బోడుప్పల్ లోని బాలాజీ నగర్ లో అద్దెకు ఉంటు న్నారు.మహేందర్ రెడ్డి రాపిడో నడుపు తున్నాడు. ఈ ఇద్దరీ మధ్య ఏం జరుగు తోంది తెలియదు కానీ భర్త మహేందర్ తన భార్య స్వాతిని హత్య చేయడమే కాకుండా ముక్కలు ముక్కలుగా కట్ చేసి... కవర్లో వేసుకుని ఎక్కడెక్కడో పడేశాడు. అయితే ఇతని కదలికలపై అనుమానం వచ్చి... స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు.

గతంలో ఈ జంట  ఇదే ప్రాంతంలోని ఇదే ఇంట్లో ఓ పది నెలలు ఉండి వెళ్ళి నట్లు స్థానికులు పోలీసులకు చెప్పారు. మళ్ళీ ఈ ప్రేమ జంట 25రోజుల క్రితమే ఇక్కడికి వచ్చి ఉంటున్నారని స్థానికులు చెబు తున్నారు. వీరు ప్రేమ వివాహం ఎప్పుడూ చేసుకు న్నారనేది పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

కాళ్ళు, చేతులు, తల వేరు చేసి ఎక్కడో వేసినట్లు తెలుస్తుంది. అవి ఇంకా పోలీసులకు దొరకనట్లు తెలుస్తుంది. ఛాతీ భాగం మాత్రమే లభ్య మైంది. చేతులు భుజాల వరకు, కాళ్ళు గజ్జల వరకు, అలాగే తల కట్ చేసినట్లు సమాచారం... లభ్యమైన  భాగాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించిన... పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో భాగం గా మిగతావిడి భాగాల కొరకు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.