TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా  మెడికో వైష్ణవి 

Published on: Sat Mar 1, 2025 11:07AM

అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా వైద్యవిద్యార్థిని  వైష్ణవి నియమితులయ్యారు. అమరావతికి చెందిన వైష్ణవి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలుసుకున్నారు.  చిన్నవయసులో వైష్ణవి సామాజిక బాధ్యతతో రాజధాని  అమరావతి  అభివృద్దికి ముందుకు వచ్చారని చంద్రబాబు కొనియాడారు. అమరావతిని  రాజధాని చేయడం నా కల అని వైష్ణవి అన్నారు. అమరావతి అభివృద్దికి  గతంలో 50 లక్షల విరాళాలు సేకరించిన  ఆమె  మరిన్ని విరాళాలు సేకరిస్తానని  వైష్ణవి  ముఖ్యమంత్రికి చెప్పారు.