TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

అమెరికా వైద్యమా.. మజాకా.. !

Published on: Wed Jan 28, 2026 1:17PM

 

అమెరికాలో వైద్య ఖర్చులు ఏ రేంజ్‌లో ఉంటాయో.. అక్కడి సెటిల్ అయిన భారతీయుడికి స్వీయ అనుభవం అయింది. అతను మోకాలి గాయానికి సాధారణ ఎలస్టిక్ బ్యాండేజ్ వేసిన అక్కడి వైద్యశిఖామణులు మొత్తం రూ.5.8 లక్షల బిల్లు వేశారు. అందులో ఇన్సూరెన్స్ పోగా.. బాధితుడు  చేతి నుంచి రూ.1.5 లక్షలు చెల్లించాల్సి వచ్చిందని వాపోయాడు. అదే సమయంలో భారత్‌లో నాణ్యమైన వైద్యం కేవలం రూ.50 లకే లభిస్తోందని ఒక అమెరికన్ మహిళ ప్రశంసించడం గమనార్హం. 

సదర ఎన్ఆర్ఐ సోషల్ మీడియాలో పంచుకున్న వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. కేవలం మోకాలికి ఒక క్రేప్ బ్యాండేజ్ వేయించుకున్నందుకు తన చేతి నుంచి సుమారు రూ.1.5 లక్షలు చెల్లించాల్సి వచ్చిందని అతను తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. న్యూయార్క్‌లో క్రిస్మస్ వేడుకల సందర్భంగా రాత్రి ఐస్ స్కేటింగ్ చేస్తుండగా ఒక వ్యక్తికి మోకాలికి గాయమైంది. విపరీతమైన నొప్పి ఉండటంతో ఫ్రాక్చర్ అయ్యిందేమోనని భయపడి దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి వెళ్లారు.  అమెరికాలో అంబులెన్స్ ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుందని తెలిసి.. ఆయన అంబులెన్స్‌కు బదులుగా టాక్సీలో ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లారు. 

అక్కడ సుమారు గంటన్నర సమయం గడిపారు. డాక్టర్లు ఎక్స్‌ రే తీసి.. మోకాలిని పరీక్షించి, ఒక సాధారణ క్రేప్ బ్యాండేజ్ వేసి ఇంటికి పంపించారు. మూడు వారాల తర్వాత వచ్చిన బిల్లు చూసి ఆయన షాక్ అయ్యాడు. అతనికి మోకాలికి క్రేప్ బ్యాండేజ్ వేసి లక్షలు వసూలు చేశారు. క్రేప్ బ్యాండేజ్ అంటే కండరాల బెణుకులు, నొప్పులు మరియు వాపులను తగ్గించడానికి ఉపయోగించే ఎలాస్టిక్ కాటన్ కట్టు. ఇది కీళ్లకు సపోర్ట్ చేస్తూ, రక్తం సజావుగా ప్రవహించేలా చేసి, నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. సాధారణంగా దాన్ని డాక్టర్ల ప్రమేయం లేకుండా ఇళ్లలో కూడా వాడుతుంటారు.