TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కొండాపూర్‌లో మెడికల్ కౌన్సిల్ ఆకస్మిక దాడులు

Published on: Thu Jun 11, 2026 2:46PM

హైదరాబాద్‌ కొండాపూర్‌లో కొన్ని ప్రముఖ స్కిన్‌, హెయిర్‌ క్లినిక్‌లపై మెడికల్ కౌన్సిల్ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. తనిఖీల్లో అర్హత లేని వ్యక్తులు వైద్య సేవలు అందిస్తున్నట్లు, సరైన అనుమతులు లేకుండానే చికిత్సలు నిర్వహిస్తున్నట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ దాడుల్లో  అధికారులు పలు క్లినిల్ లను పరిశీలించి,   రికార్డులు, వైద్య సిబ్బంది అర్హతలు, చికిత్సల విధానాలపై సుదీర్ఘంగా విచారణ చేశారు.

అక్రమాలు నిర్ధారణ అయితే  ఎన్ఎంసీ చట్టంలోని సెక్షన్ 34, 54 కింద కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. అవసరమైతే క్లినిక్‌లను సీజ్ చేసేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. అందంగా మారాలని వెళ్లిన చోట.. ఆరోగ్యమే ప్రమాదంలో పడకూడదనే ఉద్దేశంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన వైద్య రంగంలో చర్చనీయాంశంగా మారింది.