డిఎల్ వాదన వాస్తవమే..బొత్స సపోర్ట్
Published on: Wed Feb 8, 2012 4:21PM
హై
దరాబాద్: మీడియా ముందు మంత్రి డిఎల్ చేసిన వాదనలో వాస్తవముందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. డిఎల్ రాజీనామా చేయనని చెప్పారని, ఇంతటితో ఈ అంశం సమసిపోయిందని ఆయన బుధవారం అన్నారు. మంత్రి మోపిదేవి వెంకట రమణపై వచ్చిన ఆరోపణలు వాస్తవం కాదని అన్నారు. ఆయన తప్పు చేశాడని తాను భావించడం లేదని చెప్పారు. మద్యం సిండికేట్ల వ్యవహారంలో విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మోపిదేవిపై ఆరోపణలు చేసిన రమణ బ్యాక్ గ్రౌండ్ క్రిమినల్, కాబట్టి ఆయన మాటలను చట్టం పరిగణలోకి తీసుకోదన్నారు. మోపిదేవిపై ఆరోపణలను పలువురు మంత్రులు కూడా ఖండించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మద్యం మాఫియాపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. నిందితులు ఎంతటి వారైనా చర్యలు తప్పవన్నారు. మంత్రులు, ఐఏఎస్‌లు చట్టానికి అతీతులు కాదన్నారు.


