TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మెదక్ పోలింగ్: 4 గంటలకు 61 శాతం ఓటింగ్...

Published on: Sat Sep 13, 2014 4:58PM

 

మెదక్‌ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్‌ ఎలాంటి సమస్యలూ లేకుండా జరుగుతోంది. మధ్యాహ్నం వరకు 49 శాతం పోలింగ్‌ నమోదైంది. పార్లమెంటు స్థానం పరిధిలో ఉన్న మొత్తం 7 నియోజకవర్గాల్లో ఒంటిగంట సమయానికి అత్యధికంగా నర్సాపూర్‌లో 63 శాతం పోలింగ్‌ నమోదు కాగా, అత్యల్పంగా పటాన్‌చెరులో 34.5 శాతం పోలింగ్‌ నమోదైంది. సాయంత్రం 4 గంటలకు 61 శాతం పోలింగ్ పూర్తయింది. ఈసారి మెదక్ నియోజకవర్గంలో 95 శాతం పోలింగ్ జరిగే అవకాశం వుందని ఊహించారు. అయితే పోలింగ్ పూర్తయ్యే సమయానికి అనుకున్న స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలు కనిపించడం లేదని పరిశీలకులు భావిస్తున్నారు.