TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేసీఆర్ కరెక్ట్ మొగుడు జగ్గారెడ్డి: రేవంత్ రెడ్డి

Published on: Thu Aug 28, 2014 11:40AM

 

మెదక్ లోక్‌సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో భారతీయ జనతాపార్టీ అభ్యర్థిగా తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి) పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మెదక్ జిల్లాలో బాగా పేరు ప్రతిష్టలు వున్న నాయకుడు కావడం, టీడీపీ మద్దతు కూడా వుండటం, కాంగ్రెస్ పార్టీలోని కేడర్ జగ్గారెడ్డికి అనుకూలంగా వుండటంతో జగ్గారెడ్డి గెలుపు సాధ్యమన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి అభ్యర్థిత్వం గురించి బీజేపీ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి కరెక్ట్ మొగుడు జగ్గారెడ్డి అని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. అలాగే నిజాయితీగా ఉద్యమంలో పాల్గొన్న వారిని పక్కనపెట్టిన కేసీఆర్ తనకు కోట్ల రూపాయలు ఇచ్చినవారికే ఎన్నికలలో టిక్కెట్లు ఇస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.