మెదక్ స్థానానికి 18 నామినేషన్లు
Published on: Wed Aug 27, 2014 5:00PM
.jpg)
మెదక్ పార్లమెంట్ స్థానానికి మొత్తం 18 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన బుధవారం నాడుమొత్తం 13 నామినేషన్లు దాఖలయ్యాయి. మెదక్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి పోటీ చేస్తున్నారు. అలాగే టీఆర్ఎస్ నుంచి కొత్త ప్రభాకర్‌రెడ్డి రంగంలో వున్నారు. అలాగే బీజేపీ నుంచి అనూహ్యంగా జగ్గారెడ్డి తెరమీదకి వచ్చారు. ఆయన బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి బీజేపీలో చేరడంతోపాటు మెదక్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కూడా ఎంపికై నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఈ ముగ్గురు మినహా మిగతా గుర్తింపు పొందిన పార్టీలేవీ ఈ స్థానం నుంచి పోటీ చేయడం లేదు. వైసీపీ కూడా ఈ స్థానం నుంచి పోటీ చేసే ఆసక్తి చూపించలేదు.


