TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మెదక్‌లో విజయం ముందే ఊహించా.. ప్రభాకర్ రెడ్డి

Published on: Tue Sep 16, 2014 2:06PM

 

మెదక్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఊహించిందేనని ఆపార్టీ లోక్ సభ అభ్యర్థి, ఎంపీగా విజయం సాధించిన కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఫలితాల అనంతరం ఆయన మాట్లాడుతూ ఓటింగ్ శాతం తగ్గినా టీఆర్ఎస్కు మంచి మెజార్టీ వచ్చిందన్నారు. ప్రజలు టీఆర్ఎస్ను విశ్వసించారని కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి టీఆర్ఎస్ కట్టుబడి ఉందని అన్నారు. తన గెలుపుకు కృషి చేసిన నియోజకవర్గ ప్రజలకు కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.