TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఈటల రాజేందర్ కు షాక్.. జమునా హేచరీస్ భూకబ్జా నిజమేనన్న కలెక్టర్ 

Published on: Mon Dec 6, 2021 1:26PM

బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు షాక్ తగిలింది. ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమునా హేచరిస్ అసైన్డ్ భూములను కబ్జా చేసిన సంగతి నిజమేనని మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు. 56 మంది అసైనీల భూములను కబ్జా చేసినట్టు సర్వేలో తేలిందని చెప్పారు. హకీంపేట, అచ్చంపేట పరిధిలో 70.33 ఎకరాల అసైన్డ్ భూములను కబ్జా చేశారని సర్వేలో వెల్లడయిందని జిల్లా కలెక్టర్ అన్నారు. జమునా హేచరీస్ యాజమాన్యం అక్రమంగా కబ్జా చేసిందని చెప్పారు. 

అసైన్డ్ భూములను వ్యవసాయేతర అవసరాలకు వాడుతున్నారని, పెద్దపెద్ద షెడ్లను నిర్మించారని మెదక్ కలెక్టర్ వెల్లడించారు. జమునా హేచరీస్ వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి అటవీప్రాంతంలో చెట్లను నరికి రోడ్లు వేశారని చెప్పారు. హేచరీస్ నుంచి కాలుష్యం వెదజల్లుతున్నట్టు గుర్తించామని తెలిపారు. అక్రమాలకు పాల్పడిన వారిపై, వారికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వానికి కూడా నివేదిక అందిస్తామని తెలిపారు. 

ఈటలకు చెందిన జమునా హేచరిస్ అసైన్డ్ భూములను కబ్జా చేసింది నిజమేనని జిల్లా కలెక్టర్ చెప్పడంతో.. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది. ఈ భూముల వ్యవహారంలోనే రాజేందర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు కేసీఆర్. తర్వాత ఈటల టీఆర్ఎస్ కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. హుజురాబాద్ కు జరిగిన ఉప ఎన్నికలో అద్బుత విజయం సాధించి కేసీఆర్ కు షాకిచ్చారు.