TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మెదక్‌ సియస్‌ఐ చర్చి పీఠాధిపతుల నియామక వివాదం

Published on: Sat Jul 7, 2012 4:51PM

ఎంతో చరిత్ర, పవిత్రత కలిగిఉన్న మెదక్‌ సియస్‌ఐ చర్చిలో వివాదాలు తారాస్థాయినందుకున్నాయి. ఎక్కడెక్కడినుండో భక్తులు ఇక్కడికి అచంచల భక్తి విశ్వాసాలతో వస్తారు. అయితే ఇక్కడ జరిగిన అనూహ్య పరిణామాలతో ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. ప్రస్తుతం డయాసిస్‌ పీఠాధిపతి టి కనకపు ప్రసాద్‌ అవినీతికి పాల్పడుతున్నారంటూ డయాసిస్‌ హౌస్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సభ్యులు సియస్‌ఐ సినార్డ్‌లో 2012 జూన్‌ మొదటివారంలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన అధికారులు ఎలాంటి ఎలాంటి తనిఖీలు చేపట్టకుండానే బిషప్‌ కనకపు ప్రసాద్‌ను జూన్‌ 9న తొలగించారు. అనంతరం విజయవాడ బిషప్‌గా ఉన్న దైవాశీర్యాదాన్ని ఇన్‌చార్జ్‌ బిషప్‌గా కొనసాగుతారని సినార్డు అధికారులు ఉత్తర్వులు అందచేశారు. అయితే ప్రస్తుతం బిషప్‌గా కొనసాగుతున్న ప్రసాద్‌ విచారణచేపట్టకుండా, తనపదవీకాలం ముగియకుండా తొలగించటం పై కోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఈనెల 23 వరకు  కనకప్రసాద్‌ను బిషప్‌ గా కొనసాగాలని హైకోర్టు స్టే ఇచ్చింది.అయితే ఇది గిట్టని అపొజిషన్‌ వర్గం అడ్మిన్‌స్ట్రేటివ్‌ సభ్యులు సంగారెడి కోర్టు  నుండి  స్టే ఆర్డరును తీసుకువచ్చి  దైవాశీర్వాదంను హడావుడిగా చర్చిహౌస్‌కి తీసుకువచ్చి ప్రమాణ స్వీకారం చేయించారు. విషయం తెలుసుకున్న బిషప్‌ కనకప్రసాద్‌ చర్చిహౌస్‌కి  చేరుకోగానే ఇరువర్గాల మద్య వాదోపవాదం జరిగి ఉద్రిక్తత చోటు చేసుకుంది.

 

 

 

దీంతో పోలీసులు కారాక్యలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం సికింద్రాబాద్‌లోని ఎస్‌ డీ రోడ్డులోని కనకప్రసాద్‌ ఇంటిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ సీయస్‌ఐకి సంబందించి ఎలాంటి అక్రమాలకు తాను పాల్పడలేదని, సీబీఐ ఎంక్వరీ తను సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. తాను బిషప్‌గా బాధ్యతలు స్వీకరించే నాటికే అడ్మిన్‌స్ట్రేట్‌ సభ్యులు చర్చి స్ధలాలను అక్రమంగా లీజ్‌కు ఇచ్చి సొమ్ము చేసుకున్నారన్నారు. ఈ విషయంలో సహకరించాల్సిందిగా బృదం సభ్యులు, బిల్డర్లు తనపై వత్తిడి తెచ్చారని వారినుండి తనకు బెదిరింపు ఫోన్‌ కాల్సు వస్తున్నాయని ఆయన తెలిపారు. అంతేకాకుండా సికింద్రాబాద్‌ లోని స ియస్‌ ఐ చర్చిలకు సంబందించిన మెడికల్‌ కాలేజీలకు అప్పగించిన 17 కోట్లను కాజేసినట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం బిషప్‌ దైవాశీర్వాదం తో కలసి సికింద్రాబాద్‌ చర్చిలకు సంబందించిన స్థలాలను కాజేయటానికి చూస్తున్నారని ఆయన ఆరోపిస్తూ తనకు ప్రాణరక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.