TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మెదక్ లో నీటి అక్రమ వ్యాపారం

Published on: Tue Feb 21, 2012 10:47AM

రోజుకు రెండుకోట్ల లీటర్ల నీటి సరఫరా
మెదక్ జిల్లా:     మెదక్ జిల్లాలో నీటి అక్రమ వ్యాపారం యధేచ్ఛగా జరుగుతోంది. ఈ వ్యాపారమంతా ప్రధానంగా పారిశ్రామిక కేంద్రాలైన జిన్నారం, కాజీపల్లి, గడ్డిపోచారం, బొంతపల్లి, అంబాపూర్ పరిధుల్లో జరుగుతోంది. ఒక్క జిన్నారం మండలంలోనే పరిశ్రమల నీటి అవసరాలు తీర్చేందుకు ట్యాంకర్ల ద్వారా రోజుకు సుమారు కోటి లీటర్ల నీటిని అక్రమంగా తరలిస్తున్నారు.
  

 నీటి వ్యాపారం వాల్టా చట్టానికి విరుద్దం. ఈ అక్రమ వ్యాపారులు ప్రైవేటు భూముల్లోనే కాకుండా అసైన్డ్ భూముల్లో కూడా బోర్లువేసి అక్రమంగా నీటిని తోడేస్తున్నారు. మరికొందరైతే రైతులకందిస్తున్న ఉచిత విద్యుత్ ను ఈ బోరర్లు నడపడానికి ఉపయోగిస్తున్నారు. దీనివల్ల భూగర్భ జలాలు ఈ ప్రాంతంలో గణనీయంగా తగ్గిపోయాయి. ఇలా బోర్లువేసి నీటిని విక్రయించడం చట్ట విరుద్దం, అయినప్పటికీ కొందరు వ్యాపారులు నీటిని యధేచ్ఛగా విక్రయిస్తూ కోట్లాది రూపాయలు ఆర్జించారు.