TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మావోలకు సత్తా ఉంటే ప్రజల్లోకి వచ్చి పోరాడాలి

Published on: Thu Jan 26, 2012 1:24PM

హైదరాబాద్‌ : మావోయిస్ట్‌లపై టీఆర్‌ఎస్ నేత నాయిని నర్సింహారెడ్డి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.మావోయిస్టులకు చిత్తశుద్ధి, సత్తా ఉంటే తెలంగాణ కోసం ప్రజల్లోకి వచ్చి పోరాడాలని టీఆర్‌ఎస్‌ నేత నాయిని నర్సింహారెడ్డి మండిపడ్డారు.గణతంత్ర దినోత్సవం సందర్భంగా  తెలంగాణ భవన్‌లో జెండా ఆవిష్కరించిన సందర్భంగా నాయిని మాట్లాడుతూ మావోయిస్టులపై మండిపడ్డారు. ఉనికి కోసమే మావోయిస్ట్‌లు టీఆర్‌ఎస్‌ను విమర్శిస్తున్నారన్నారు.టీఆర్‌ఎస్‌పై మావో నేత జగన్‌ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. మావోయిస్టుల సమస్యలపై పోరాటం చేసింది కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రమేనని ఆయన గుర్తు చేశారు. చిత్తశుద్ది ఉంటే ప్రజల్లోకి వచ్చి తెలంగాణ ఏర్పాటు కోసం ఉద్యమం చేయాలని కోరారు.