మాయావతి చక్రం తిప్పేనా?
Published on: Thu May 18, 2023 2:40PM
బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి గురువారం పార్టీ అభ్యర్థులు యుపీలోని అన్ని లోక సభ స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. యుపిలో మొత్తం 30 స్థానాలు ఉన్నాయి. యూపీలో సమాజ్ వాది పార్టీ బలమైన పార్టీ. కాన్షీ రాం బతికున్నప్పుడు యూపీ రాజకీయాలను మలుపు తిప్పారు. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారంలో ఉండే రాజకీయాలు కాన్షీ రాం దెబ్బకు పలాయనం చిత్తగించాయి. ప్రస్తుతం ఆమె వారసురాలు కుమారి మాయావతి ఇక్కడ చక్రం తిప్పుతున్నారు. వోట్ హమారా రాజ్ తుమారా నహీ చలేగా అనేది మాయావతి ప్రస్తుతం ఇచ్చిన స్లోగన్. అంటే రాజ్యం మాది. అధికారం మీది అనేది నడవదు అని ఆమె పిలుపునిస్తున్నారు.
ఇటీవలె జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి అక్రమాలకు పాల్పడిందని ఈ ఎన్నికల్లో ప్రజలు బిఎస్పీకి వోటు వేస్తారని మాయావేస్తారని మాయావతి ధీమా వ్యక్తం చేస్తున్నారు.
గత లోకసభ ఎన్నికల్లో బిఎస్పీ యుపీలో బిఎస్పీ మొత్తం 80 స్థానాలకు గాను 10 స్థానాలను కైవసం చేసుకుని రెండో స్థానంలో నిలిచింది. బిజెపి 62 స్థానాలను కైవసం చేసుకుంని మొదటి స్థానంలో నిలిచింది. సమాజ్ వాది పార్టీ 5 స్థానాలు కైవసం చేసుకుని మూడో స్థానంలో ఉంది.


