TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మాయావతికి ఎన్నికల సంఘం గట్టి ఝలక్

Published on: Sun Jan 8, 2012 8:45AM

ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతికి ఎన్నికల సంఘం గట్టి ఝలక్ ఇచ్చింది. ఎన్నికలకు ముందు ఎడాపెడా తన విగ్రహాలను ఆవిష్కరించుకుంటూ పోతున్న మాయకు షాకిచ్చింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన దరిమిలా ఇటువంటి చేష్టలు మానుకోవాలని మాయకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి తూట్లు పొడుస్తూ మాయావతి బహిరంగ ప్రదేశాల్లో విగ్రహావిష్కరణ కార్యక్రమాలు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. దీంతో ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఇందులో భాగంగా యూపీలో విగ్రహావిష్కరణపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది.