TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

మహిళలతో సమానంగా పురుషులకూ పితృత్వ సెలవులు....

Published on: Tue Mar 14, 2017 4:11PM

 

ఇటీవలే పార్లమెంట్ లో మహిళలకు ప్రసూతి సెలవులు 12 వారాల నుంచి 26 వారాలకు పెంచుతూ  ప్రసూతి ప్రయోజనాల చట్టానికి సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మహిళలతో పాటు సమానంగా పురుషులకూ 26వారాల పాటు పితృత్వ సెలవులను అందించనుంది స్వీడన్‌కు చెందిన ఫర్నిచర్‌ తయారీ సంస్థ ఐకియ ఇండియా. ఈ మేరకు భారత్‌లోని తమ సంస్థ ఉద్యోగులకు 26 వారాల పేరెంటల్‌ లీవ్‌ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఉద్యోగులకు సమానావకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ హెచ్‌ఆర్‌ మేనేజర్‌ అన్నా కేరిన్‌ మాన్సన్‌ తెలిపారు. అంతేకాదు సరోగసీ, దత్తత మార్గాన్ని అనుసరించిన వారికి కూడా ఈ పాలసీ వర్తిస్తుందని కంపెనీ తెలిపింది.