TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వ్యాపారి ఇంట్లో భారీ చోరీ... నేపాలీలే!

Published on: Tue Jun 9, 2026 12:36PM

హైదరాబాద్ నగరంలో  బడా బాబులను టార్గెట్గా చేసుకొని నేపాలి వాళ్లు గృహ సహాయకులుగా చేరి దోపిడీకి పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.  రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఇంట్లో నేపాలి వాళ్లు పనిచేస్తూ అధికారి భార్యను హత్య చేసి దోపిడీకి పాల్పడిన ఘటన,  రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో బర్తడే పార్టీ పేరుతో భార్యాభర్తలకు మత్తు పదార్థాలు ఇచ్చి ఇల్లు గుల్ల చేసిన ఘటనలు మరవ కముందే గచ్చిబౌలిలో మరో భారీ చోరీ వెలుగులోకి వచ్చింది.

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రముఖ వ్యాపారి నివాసం ఉంటున్నారు. ఇంట్లో   నేపాలీ దంపతులను పనిలోకి పెట్టుకున్నారు.  నెల రోజుల క్రితమే ఈ నేపాల్ దంపతులను వ్యాపారి ఇంటి పనుల కోసం నియమించుకున్నారు కొద్దిరోజుల క్రితం వ్యాపారి తన కుటుంబ సభ్యుల తో కలిసి ముంబై కి వెళ్లి తిరిగి,  ఇంటికి వచ్చిన సమయంలో నేపాలి దంప తులు ఇంట్లో కనిపించలేదు. ఇంటి తాళాలు తలుపులు బలవంతంగా పగలగొట్టిన ఆనవాళ్లు కూడా లేకపోవడంతో మొదట వారు చెప్పకుండా వెళ్ళిపోయారని కుటుంబ సభ్యులు భావించారు. అనంతరం కుటుంబ సభ్యులు పూజ గదిలోని విగ్రహానికి అలంకరించిన బంగారు గొలుసు కనిపించ కపోవడంతో అనుమానం వచ్చింది. అనంతరం ఇంట్లో పూర్తిస్థాయిలో తని ఖీలు నిర్వహించగా ఇంట్లో ఉన్న మరికొన్ని బంగారు ఆభరణాలు కూడా మాయ మైనట్లుగా గుర్తించారు. 

దీంతో బాధిత వ్యాపారి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీ సులు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంట్లో పని చేసే నేపాలీ దంపతులపై అనుమానం వ్యక్తం చేస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.   మొత్తం ఒక కిలో బంగారం చోరీ జరిగిందని, దాని విలువ కోటి రూపా యలు ఉంటుందని బాధిత వ్యాపారి తెలిపారు.