TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

11మంది సజీవదహనం.. కేసీఆర్ దిగ్భ్రాంతి

Published on: Wed Jul 4, 2018 3:34PM

 


వరంగల్ నగర శివారులోని కోటిలింగాల వద్ద భద్రకాళి ఫైర్ వర్క్స్‌లో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.. ప్రమాదవశాత్తు టపాసులు పేలడంతోనే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.. ఈ ప్రమాదంలో 11మంది కార్మికులు సజీవదహనమయ్యారు.. అలానే మరో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.. ఈ సంఘటన గురించి తెలిసి సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు.. భాదిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చిన కేసీఆర్.. మృతుల కుటుంబాలకు 5 లక్షలు పరిహారం ప్రకటించారు.