TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దుండిగల్‌లో భారీ అగ్ని ప్రమాదం

Published on: Thu Apr 9, 2026 9:40AM

హైదరాబాద్ నగర పరిధి లోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి బహదూర్‌పల్లి గ్రీన్ హిల్స్ కాలనీలో   గురువారం (ఏప్రిల్ 9) ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. డెకరేషన్ సామాగ్రి నిల్వ ఉంచిన గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగి స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాయి. గోదాములో ఉన్న ప్లాస్టిక్ డెకరేషన్ వస్తువులు, ఫ్లెక్సీలు, థర్మాకోల్ సామాగ్రి పెద్ద మొత్తంలో ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి.

పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతూ కొద్దిసేపటికే గోదాం పక్కనే ఉన్న నివాస గృహానికి కూడా వ్యాపించడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఆ గోదాములో ఉన్న ప్లాస్టిక్ సామాగ్రి కాలిపోవడంతో దట్టమైన నల్లటి పొగ కాలనీ  మొత్తం వ్యాపించి  స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు.  సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసిం ది.  అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.