చత్తీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్...7 గురు నక్సలైట్లు దుర్మరణం
Published on: Fri Oct 4, 2024 7:26PM
చత్తీస్ గడ్ లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు కూంబింగ్ జరుపుతుండగా నక్సలైట్లు కాల్పులు జరిపారు. పోలీసులు ప్రతి కాల్పులు జరిపితే ఏడుగురు నక్సలైట్లు చనిపోయారు. చత్తీస్గడ్లో గత జనవరి నుంచి ఇప్పటివరకు 200 మంది నక్సలైట్లు చనిపోయారు. నారాయణపూర్ దంతెవాడ జిల్లా సరిహద్దుల్లో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. చత్తీస్ గడ్ లో మావోయిస్టుల రిక్రూట్ మెంట్ తగ్గింది. ఎన్ కౌంటర్ల ద్వారా నక్సలైట్లను మట్టు పెడితే రిక్రూట్ మెంట్ తగ్గిపోతుందని పరిశీలకులు అంటున్నారు. దాదాపు నాలుగు గంటలకు పైగా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి.


