TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉమ్ముతో మసాజ్.. దూల తీరింది ఎదవకి!

Published on: Thu Aug 8, 2024 11:39AM

ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ మెంటలోడు బార్బర్ షాపు నడుపుతున్నాడు. తన దగ్గరకి వచ్చే కస్టమర్లు ఫేస్ మసాజ్ చేయించుకునేటప్పుడు మధ్యమధ్యలో ఉమ్ముతో కూడా మసాజ్ చేసేవాడు. అలా చేయడం మాత్రమే కాకుండా.. దాన్ని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆ వీడియో వైరల్ అయింది. ఆ వీడియో గమనించిన అధికారులు సీరియస్ అయ్యారు. అతని బార్బర్ షాపు చిట్టా బయటకి తీశారు. అది అక్రమంగా కట్టిన షాపు అని తెలిసింది. అంతే, బుల్డోజర్ తీసుకొచ్చి బార్బర్ షాపుని కూల్చేశారు. ఉమ్ముతో మసాజ్ చేసిన ఆ మెంటలోడిని కూడా అరెస్టు చేశారు. లేనిపోని దరిద్రాన్ని నెత్తిమీద పెట్టుకోవడం అంటే ఇదే.