TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమెరికాలో పంద్రాగస్టు ఇండియా డే.!

Published on: Wed Aug 5, 2026 9:58AM

ఆగస్టు 15 భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజును  అమెరికాలో మాసచుసెట్స్ ఇండియా డేగా ప్రకటించింది. ఈ మేరకు  మాసచుసెట్స్ గవర్నర్ మౌరా హీలీ  ఉత్తర్వులు జారీ చేశారు. 1947లో బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొంది, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించిన ఇండియా.. ఈ ఏడాది   79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న   సందర్భాన్ని పురస్కరించుకుని మాసచుసెట్స్ లో పంద్రాగస్టును ఇండియా డేగా జరుపుకోవాలన్న నిర్ణయం తీసుకున్నట్లు  గవర్నర్ తన  ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

అమెరికా సామాజిక, ఆర్థిక, పౌర జీవితంలో ఇండియన్ అమెరికన్ల పాత్రనూ, వారి సేవలకూ ఇది ప్రత్యేక గౌరవంగా ఆమె పేర్కొన్నారు.      అమెరికాలో 50 లక్షలకు ) పైగా మంది భారతీయులు నివసిస్తూ, ఆ దేశ ఆర్థిక పురోగతికి, నూతన ఆవిష్కరణలకు వెన్నెముకగా నిలుస్తున్నారు. మరీ ముఖ్యంగా  మాసచుసెట్స్ లో వైద్యం, శాస్త్ర సాంకేతిక రంగాలు, ఉన్నత విద్య, ఐటీ , ప్రజా సేవా రంగాలలో  ఇండియన్ అమెరికన్ల ప్రాతినిథ్యాన్ని ఈ సందర్భంగా  గవర్నర్ మౌరా హీలీ   ప్రశంసించారు. ఇండియన్ల  కష్టపడే తత్వం, వైవిధ్యభరితమైన సంస్కృతి, భిన్నత్వంలో ఏకత్వం, శాంతి,  పురోగతి పట్ల ఉన్న అంకితభావం మాసచుసెట్స్ సమాజాన్ని సుసంపన్నంగా మార్చాయని  పేర్కొన్నారు. 

అలాగే బోస్టన్ మేయర్ మిషెల్ వూ   కూడా బోస్టన్ నగరంలో ఆగస్టు 15ను  ఇండియా డే గా ప్రకటించారు.   ఫౌండేషన్ ఆఫ్ ఇండియన్ అమెరికన్స్ – న్యూ ఇంగ్లాండ్  ) ఆధ్వర్యంలో బోస్టన్ హార్బర్ వద్ద నిర్వహించిన ఇంటర్నేషనల్ ఇండియా డే పరేడ్.. భారత సాంస్కృతిక వైభవాన్ని అమెరికా గడ్డపై  ఆవిష్కరించింది. 20కి పైగా దేశాల ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరైన ఈ పరేడ్‌లో బాలీవుడ్ నటుడు జుగల్ హన్స్‌రాజ్ గ్రాండ్ మార్షల్‌గా వ్యవహరించగా, జార్జ్ వాషింగ్టన్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరియు సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి జ్ఞాపకార్థం రూపొందించిన ప్రత్యేక శకటాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.   

Massachusetts India Day, Maura Healey Proclamation, August 15 India Day USA, Indian Diaspora in US, Boston India Day Parade, FIA New England