రాష్ట్రపతి భవన్లో మాస్క్‌లు కుట్టిన మొదటి మహిళ!
Published on: Thu Apr 23, 2020 12:12PM
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ భార్య సవితా కోవింద్ మాస్క్‌లు కుడుతున్నారు. ప్రెసిడెంట్ ఎస్టేట్‌లోని శక్తి హాత్‌లో ముఖానికి ధరించే మాస్క్‌లను ఆమె కుట్టారు. ఢిల్లీలో ఉన్న షెల్టర్ హోమ్స్‌లో ఆ మాస్క్‌లను పంపిణీ చేయనున్నారు. ఎరుపు రంగు మాస్క్‌ను ముఖానికి ధరించిన ఆమె కుట్టుమిషన్‌పై మాస్క్‌లు కుట్టారు. అందరం కలిసికట్టుగా కోవిడ్19పై పోరాటం చేయాలన్నారామె. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలంతా సోషల్ డిస్టాన్సింగ్ పాటించాలన్నారు.
ఇళ్ల నుంచి బయటకు వచ్చే వాళ్లు తప్పని సరిగా మాస్క్‌లు ధరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇళ్ల నుంచి బయటకు వచ్చేవారు తప్పనిసరిగా మూడు లేయర్ల మాస్క్ కానీ, ఇంట్లో తయారు చేసిన మాస్క్ కానీ ధరించాలని, అలాకాకుండా బయటకు వెళ్లవద్దని ఆమె కోరారు.


