మసాలా సెన్సార్ రిపోర్ట్
posted on: Nov 8, 2013 10:11AM

వెంకటేష్, రామ్ కలిసి నటించిన తాజా మల్టీస్టారర్ చిత్రం "మసాలా". హిందీలో "బోల్ బచ్చన్" చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఇటివలే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్ కు వెళ్ళింది. ఈ సినిమాకు సెన్సార్ వారు ఎలాంటి కటింగ్ లు చేయకుండా క్లీన్ U సర్టిఫికేట్ ఇచ్చారు.
పేరుకే "మసాలా" అయినా కూడా సినిమాలో ఎలాంటి మసాలాలు లేకపోవడంతో ఇది కుటుంబ సమేతంగా చూడవచ్చని, అందుకే క్లీన్ U సర్టిఫికేట్ ను ఇచ్చినట్లు తెలిసింది.దీంతో చిత్ర యూనిట్ సభ్యులు తెగ ఆనందపడిపోతున్నారు. కామెడి ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో వెంకటేష్ సరసన అంజలి, రామ్ సరసన షాజన్ పదాంసీ హీరోయిన్లుగా నటించారు. తమన్ అందించిన పాటలు ఇటివలే విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ చిత్రాన్ని ఈ నెల 14న రిలీజ్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.






