TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విజయనగరంలో మావోయిస్టుల పాగా

Published on: Mon May 7, 2012 9:54AM

ఉత్తరాంధ్రాలోని విజయనగరం జిల్లాలో చాలాకాలం తరువాత మళ్ళీ మావోయిస్టుల ఉనికి కనిపిస్తోంది. ఇప్పటికే ఆంద్ర-ఒడిస్సా సరిహద్దు ప్రాంతంలో యుద్ధవాతావరణం నెలకొని ఉంది. ఒడిస్సాలో మావోయిస్టులు కిడ్నాపులకు పాల్పడి తమ సహచరులను జైళ్ళనుంచి విడిపించుకుంటున్నారు. ఇదే వ్యూహాన్ని విజయనగరంలో కూడా అమలు చేసేందుకు మావోయిస్టు గెరిల్లా దళాలు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. దీంతో జిల్లా పోలీసుయంత్రాంగం అప్రమత్తం అయింది. నక్సల్స్ ఆచూకీ తెలుసుకునేందుకు ప్రత్యేక సాయుధబలగాలు రంగంలోకి దిగి కూంబింగ్ ప్రారంభించాయి. దీనికి తోడు అధికారులు ఎవరూ సమాచారం ఇవ్వకుండా గ్రామాల్లోకి వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో తమ ఉనికిని చాటుకునేందుకు ఉత్తరాంధ్ర జిల్లాలో ఏదో ఒక చోట భారీ విధ్వంసానికి కానీ, పెద్దేత్తున దాడులకు కానీ పూనుకోవచ్చునని ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.