Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ..కీలక నేత హిడ్మా అరెస్ట్
posted on: May 29, 2025 4:47PM

మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత హిడ్మాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశా, కోరాపూట్ అడవుల్లో భద్రతా బలగాలు చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌లో హిడ్మాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిడ్మా ప్రస్తుతం మావోయిస్టు ఏరియా కమీటీ సభ్యుడిగా ఉన్నారు. అయితే.. మావోయిస్టులకు వరుసగా భారీ షాక్‌లు తగులుతున్నాయి.
ఇటీవలే ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందారు. ఆయనతో పాటు మరో 27 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన సంగతి తెలిసిందే. వారిలో నంబాల కేశవరావు ఉన్నట్లు స్వయంగా కేంద్ర హోంశాఖ అధికారికంగా ధ్రువీకరించింది. ఇది జరిగిన వారం రోజులకే కీలక నేత హిడ్మా పోలీసులకు చిక్కడం హాట్ టాపిక్‌గా మారింది.






