TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాల్ మనీ నేరస్థులకు మావోయిస్టుల వార్నింగ్

Published on: Mon Dec 28, 2015 4:37PM

 

మావోయిస్టులు విడుదల చేసిన కరపత్రాలు ఏపీ నూతన రాజధాని ప్రాంతంలో సంచలనం సృష్టిస్తున్నాయి. కాల్ మనీ నేరస్థులను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించిన మావోయిస్టులు వారిని ప్రజాకోర్టులో తాము శిక్షించడం ఖాయమని ఆ కరపత్రాలలో హెచ్చరించారు. అంతే కాకుండా కొన్ని పత్రికా కార్యాలయాలకు కూడా వారు ప్రకటనలు పంపించారు. కాల్ మనీ,సెక్స్ రాకెట్ నిందితులకు శిక్షలుపడేలా ప్రజలు ,ప్రజాసంఘాలు పోరాడాలని వారు పిలుపు ఇచ్చారు. కాల్ మనీ వ్యాపారులను అపహరించె ప్రమాదముందని ఊహిస్తున్న పోలీసులు కూడా అప్రమత్తమవుతున్నారు.