మీడియాపై కేసీఆర్ వ్యాఖ్యలు: మావోయిస్టుల ఖండన...
Published on: Thu Sep 18, 2014 9:32AM

తెలంగాణలో వుండాలంటే తమకు సలాం కొట్టాలని, మీడియావాళ్ళ మెడలు విరిచేస్తామని, పది కిలోమీటర్ల లోతున పాతిపెడతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను మావోయిస్టులు ఖండించారు. తెలంగాణ రాష్ట్రంలో టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెళ్ళ నిషేధం విషయంలో ఎంఎస్‌ఓల ప్రతిస్పందన న్యాయంగానే వుందని, అయితే వారి ప్రతిస్పందన పాలకుడి నియంతృత్వానికి దారి తీయకూడదని మావోయిస్టు పార్టీ అభిప్రాయపడింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జగన్ ఒక లేఖను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా మీద చేసిన నియంతృత్వ వ్యాఖ్యలు, నిషేధ ఫత్వాలను ఖండిస్తున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ మీడియా మీద నిషేధం తగదని ఆ లేఖలో పేర్కొన్నారు.


