TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదు : బండి సంజయ్‌

Published on: Sun May 4, 2025 3:51PM

 

 

మవోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లిలో ఆయన  హాట్ కామెంట్స్ చేశారు.‘తుపాకీతో అమాయకులను చంపేవారితో చర్చలు ఉండవు. మావోయిస్టులతో ఇక మాటల్లేవ్‌.. మాట్లాడుకోడాల్లేవ్‌. వారిపై నిషేధం విధించింది కాంగ్రెస్సే. మావోయిస్టులు.. పలు పార్టీల నేతలను మందుపాతరలు పెట్టి చంపారు. ఇన్‌ఫార్మర్ల పేరుతో గిరిజనులను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు. ఎన్నో గిరిజనుల కుటుంబాలకు మానసిక క్షోభ మిగిల్చారు. తుపాకీ వదిలిపెట్టేవరకు మావోయిస్టులతో చర్చల ఊసే ఉండదన్నారు. పాస్‌పోర్టు లేని విదేశీయులను గుర్తించి పంపిస్తున్నాం. రోహింగ్యాలపై తన వైఖరి ఏమిటో కాంగ్రెస్‌ పార్టీ చెప్పాలి’’ అని బండి సంజయ్‌ అన్నారు. ‘కేంద్రం నిర్ణయాన్ని తమ విజయంగా చెప్పుకోవడం  సిగ్గుచేటు’’ అన్నారు. 

స్వాతంత్రం తర్వాత ఎన్నడూ దేశవ్యాప్తంగా కుల గణన జరగనివ్వని కాంగ్రెస్ పార్టీకి దీనిపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. 2010లో అనేక పార్టీల డిమాండ్‌కు స్పందిస్తూ మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చివరకు కేవలం ఓ సర్వేనే చేపట్టిందన్నారు. కొన్ని రాజకీయ పక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మావోయిస్టులతో చర్చలు జరపాలని పోటీ పడుతున్నాయని సంజయ్ ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే  ఇలాంటి అంశాలను తెరపైకి తెస్తోందని విమర్శించారు. శాంతి భద్రతల సమస్యను రాజకీయం చేయడం సరికాదని హితవు పలికారు.