శభాష్ మిస్ మనూ బాకర్!
Published on: Thu Aug 8, 2024 11:47AM
ప్యారిస్ ఒలింపిక్స్.లో రెండు కాంస్యాలు సాధించిన షూటర్ మను భాకర్ గురువారం నాడు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ని కలిశారు. బుధవారం ఆమె లండన్ నుంచి వచ్చారు. తనను మను బాకర్ కలిసిన సందర్భంగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమెని అభినందనలతో ముంచెత్తారు. ఈ సమావేశంలో మను బాకర్ కోచ్ జస్పాల్ రాణా కూడా పాల్గొన్నారు. మను బాకర్ మళ్ళీ శనివారం నాడు లండన్కి తిరిగి వెళ్ళనున్నారు. అక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.


