ఆ అమ్మాయిలను చూస్తుంటే భయమేస్తుంది...

 

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కు అమ్మాయిలను చూస్తుంటే భయమేస్తుందట. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా....? ఆల్కహాల్ సేవించే అమ్మాయిలను చూస్తుంటే అట. గోవాలో జరిగిన స్టేట్ యూత్ పార్లమెంట్ లో  పాల్గొన్న ఆయన గోవాలో మాదకద్రవ్యాల వ్యాపారంపై మాట్లాడుతూ..డ్రగ్ నెట్ వర్క్ ను అంతమొందించే ఆపరేషన్ కొనసాగుతోందని.. రాష్ట్రం నుంచి డ్రగ్స్ ను తరిమికొడతామనే నమ్మకం తనకు ఉందని తెలిపారు. కాలేజీలో డ్రగ్స్ సంస్కృతి ఎక్కువగా ఉందని భావించడం లేదని చెప్పారు. ఇప్పటి వరకు 170 మంది డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేశామని తెలిపారు. మన చట్టం ప్రకారం కొంత మొత్తం డ్రగ్స్ తో పట్టుబడిన వ్యక్తులు ఎనిమిది నుంచి 15 రోజుల్లో బెయిల్ పై బయటకు వస్తున్నారని... వీరిని కోర్టులు కూడా ఏమీ చేయలేకపోతున్నాయని... ఏదేమైనా డ్రగ్స్ వాడుతున్నవారు పట్టుబడుతుండటం జరుగుతోందని అన్నారు. అంతేకాదు.. అమ్మాయిల్లో ఆల్కహాల్ సేవించే అలవాటు ఎక్కువవుతోందని... ఇది తనకు ఎంతో భయాన్ని కలగజేస్తోందని అన్నారు.