TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

కాంగ్రెస్ విఫలం... సీఎంగా పారికర్ ప్రమాణ స్వీకారం...

Published on: Mon Mar 13, 2017 11:37AM

 

గోవాలో కూడా బీజేపీ పార్టీనే అధికార పగ్గాలు చేపట్టనుంది. గోవా ఎన్నికల ఫలితాల్లో బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే బీజేపీ కన్నా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకున్నప్పటికీ.. ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో మాత్రం విఫలమైంది. 17 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మద్దతును కూడగట్టుకోవడంలో విఫలమైంది. ఇక బీజేపీ మాత్రం 13 సీట్లనే గెలుచుకన్నా కానీ.. ఆతరువాత రంగంలోకి దిగి.. మూడు సీట్లను కైవసం చేసుకున్న మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ (జీఎంపీ), గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్‌పీ), స్వతంత్ర అభ్యర్థి గోవింద్ గవాడేల మద్దతును కూడగట్టుకుంది. దీంతో గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలంటూ  పారికర్‌  గవర్నర్‌ మృదులా సిన్హాకు ఆదివారం విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన గవర్నర్..  ఆయన్ని ముఖ్యమంత్రిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. దీనితో పాటు ప్రమాణస్వీకారం చేశాక 15 రోజుల్లోగా అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని సూచించారు. మరి ఈ లోగా కాంగ్రెస్ పార్టీ బలనిరూపణ వరకైనా ఏమైనా ఎత్తులు వేస్తుందా.. లేక బీజేపీ పార్టీకే అధికారం కట్టబడుతుందా తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.