TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

భారత్‌కు శాస్త్రవేత్తలు కావాలి-మోడీ

Published on: Sun Feb 26, 2017 1:14PM

శాస్త్ర, సాంకేతిక రంగంలో ఇస్రో చరిత్ర సృష్టించిందన్నారు ప్రధాని నరేంద్రమోడీ..మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ప్రధాని రేడియోలో జాతినుద్దేశించి ప్రసంగించారు. ఒకేసారి అంతరిక్షంలోకి 104 ఉపగ్రహాలను పంపిన ఘనత ఒక్క భారత్‌కు మాత్రమే దక్కిందన్నారు. యువతలో శాస్త్ర, సాంకేతిక నైపుణ్యాలు పెరగాలన్నారు. ఈ ఏడాది 2,700 లక్షల టన్నులకు పైగా ఆహార ధాన్యాల ఉత్పత్తి నమోదైందన్నారు. లక్కీ గ్రాహక్, డిజిధన్ వ్యాపారి పథకాలు విజయవంతమైనట్లు తెలిపారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన భీమ్ యాప్‌పై ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తామని, నోట్ల రద్దు తర్వాత నగదు రహిత లావాదేవీలు గణనీయంగా పెరిగాయన్నారు.