ప్రణబ్ అప్పుడు ఫీల్ అయి ఉంటారు..!

 

కాంగ్రెస్ హయాంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రెండు సార్లు ప్రధాని అయిన సంగతి తెలిసిందే. పేరుకు ప్రధానే కానీ.. చక్రం మొత్తం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీనే తిప్పేవారని జగమెరిగినా సత్యం. ఈ నేపథ్యంలోనే ఆయనపై రబ్బర్ సింగ్ అనే విమర్శలు కూడా గుప్పించేవారు. అలాంటి మన్మోహన్ సింగ్ తన రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొత్త  పుస్తకం ఆవిష్కరణ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. తాను యాక్సిడెంటల్‌గా (అనుకోకుండా) రాజకీయాల్లోకి వచ్చానని.. అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు తనను కేబినెట్‌లోకి ఆహ్వానించి ఆర్థిక మంత్రిని చేశారని గుర్తు చేశారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత ప్రణబ్‌ను ప్రధానిగా ఎన్నుకోకపోవడంతో ఆయన బాధపడే ఉంటారని అన్నారు.

 

అయితే ఇప్పుడు మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై పలు కామెంట్లు విసురుతున్నారు నెటిజన్లు. అవునా.. ? అలా జరిగిందా అంటూ కొంత మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే.. మరికొంత మంది మాత్రం... ఆ ప్రమాదం కారణంగా పదేళ్లు భరించాల్సి వచ్చిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాదు రిమోట్ కంట్రోల్ ద్వారా మీరు ప్రధాని అయ్యారని ఇంకొకరు పోస్ట్ చేశారు.