మనీషా కోయిరాల కేన్సర్ ఆపరేషన్ విజయవంతం
Published on: Tue Dec 11, 2012 3:42PM

మనీషా కొయిరాలకు అమెరికా వైద్యులు నిర్వహించిన కేన్సర్ సర్జరీ సక్సెస్ అయింది. కేన్సర్ బారిన పడి అనారోగ్యానికి గురైన మనీషా కొయిరాలకు సోమవారం వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. శస్త్ర చికిత్స అనంతరం కొయిరాలా కోలుకుంటోందని ఆమె మేనేజర్ సుబ్రతో ఘోష్ తెలిపారు. అమెరికాలో మనీషా వెంట ఆమె తల్లిదండ్రులు, సోదరుడు ఉన్నారు. అయితే మనీషాకు కేన్సర్ సోకిన విషయం ఇటీవలే బయట పడింది. అస్వస్థతకు గురైన ఆమె ముంబైలోని జస్లోక్ ఆసుపత్రిలో చేరగా టెస్టుల్లో సర్వైకల్ కేన్సర్ ఉన్నట్లు తేలింది. ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి ఇండియాకు రానున్నారు.


