TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మనీషా కొయిరాలకు కేన్సర్

Published on: Thu Nov 29, 2012 4:18PM

 

manisha koirala cancer, manisha koirala cancer news, manisha cancer , manisha cancer news  

 

బాలీవుడ్ ని ఒకప్పుడు ఓ ఊపు ఊపిన అందాల సుందరి మనీషా కొయిరాలా ఇప్పుడు కేన్సర్ బారిన పటడింది. కేన్సర్ ప్రభావాన్ని తీవ్రంగా అనుభవిస్తున్న మనీషా కొంతకాలంగా ఆమె జస్లోక్ ఆసుపత్రిలో  ట్రీట్మెంట్ తీసుకుంటోంది. మనీషా కేన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న విషయాన్ని ఇంతకాలం దాచిపెట్టగలిగినా  ఇప్పుడా రహస్యం బైటపడిపోయింది.

 

నేపాల్ రాజ కుటుంబానికి చెందినా మనీషా కొయిరాలా  1991 లో సౌదగర్ చిత్రం తో హిందీ పరిశ్రమలో కాలుపెట్టింది. రజనీకాంత్, కమల్ హసన్ , షారుక్ ఖాన్ లాంటి సూపర్ స్టార్స్ తో సినిమాలు చేసి ఎందరినో అలరించింది. మనీషా కేన్సర్  మహమ్మారిని జయించి త్వరలో ఆరోగ్యం పుంజుకోవాలని కుటుంబసభ్యులతోపాటు అప్పట్లో ఆమెని పిచ్చిగా ఆరాధించిన అభిమానులుకూడా కోరుకుంటున్నారు.