మణిరత్నం లాస్ట్ గ్లోరీ...!
Published on: Fri Mar 15, 2013 6:21PM
అద్భుతమైన ప్రేమకావ్యాలను తెరపై ఆవిష్కరించిన దర్శకరత్నం... మణిరత్నం పేరువింటేనే ఇప్పుడు నిర్మాతలు ఆమడ దూరం పరిగెడుతున్నారు. “కడలి” మిగిల్చిన విషాదమే దీనికి కారణం అనుకున్నా... మరో కారణం కూడా ఉందని తెలుస్తోంది. మణిరత్నం... టాప్ డైరెక్టర్ గా వెలుగొందుతున్న రోజుల్లో ఆయన డేట్స్ కోసం.... తొలుత సుహాసినిని సంప్రదించవలసి వచ్చేది. ఇది కొందరికి మింగుడు పడనప్పటికీ... తప్పనిసరి పరిస్థితుల్లో అదే విధానాన్ని అనుసరించేవారు. వరుస ఫ్లాపులు చవిచూస్తున్నా... ఇప్పటికీ ఇదే పద్ధతి కొనసాగుతోంది. నిర్మాతలు... మణికి దూరమైపోవడానికి ఇదే ప్రధానమైన కారణం అని కాలీవడ్ జనాలు చెప్పుకుంటున్నారు.


