మంగలి కృష్ణకు విముక్తి
Published on: Wed Dec 5, 2012 1:36PM

అనంతపూర్ జిల్లాలో సంచలనం రేకెత్తించిన సూట్ కేసు బాంబు కేసులో జైలులో ఉన్న పులివెందుల కృష్ణ అలియాస్ మంగలి కృష్ణ కు కోర్టు ఆ కేసు నుండి విముక్తి కలుగ చేసింది. ఈ కేసులో ఉన్న ఇతర ముద్దాయిలకు కూడా కోర్టు తీర్పు ఊరటనిచ్చింది. తగిన సాక్ష్యా దారాలు లేని కారణంగా ఈ కేసును కొట్టి వేస్తూ అనంతపూర్ నాలుగో అదనపు ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు.
2001 మార్చి 19 న తెలుగుదేశం ఎంఎల్ఏ పరిటాల రవీంద్రను సూట్ కేసు బాంబు ప్రయోగించి హత్య చేయడానికి విఫల యత్నం జరిగింది. మంగలి కృష్ణ తో పాటు, మరో నలుగురి ఫై అనంతపూర్ పోలీసులు 2005 లో ఈ కేసు నమోదు చేశారు. మద్దెల చెరువు సూరి అనుచరుడు భాను కిరణ్ కు తుపాకీ సరఫరా చేసిన కేసులో కూడా మంగలి కృష్ణ కు ఇదివరకే బెయిల్ లభించిన విషయం తెలిసిందే.


