ప్రోటెం స్పీకర్ గా మేనకా గాంధీ
Published on: Fri May 31, 2019 11:41AM

లోక్‌సభ సమావేశాలకు ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ సీనియర్ నేత, ఎంపీ మేనకా గాంధీని ఎంపిక చేసినట్లు సమాచారం. లోక్ సభ కు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ఆమె ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఆ తరువాత లోక్ సభ సభ్యుల నుంచే కొందరిని పూర్తి స్థాయి స్పీకర్, డిప్యూటీ స్పీకర్లుగా ఎన్నుకుంటారు. వరుసగా ఎనిమిది సార్లు విజయం సాధించిన మేనకా గాంధీ.. గత ఎన్డీఏ ప్రభుత్వంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే.


