TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మంత్రి శంకరరావు దాడిపై మందకృష్ణ అనుమానం

Published on: Fri Dec 23, 2011 11:40AM

హైదరాబాద్: చేనేత, జౌళీ శాఖ మంత్రి శంకరరావుపై దాడిలో హోంమంత్రి తనయుడి హస్తం ఉందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అనుమానం వ్యక్తం చేశారు. శంకరరావుపై దాడి జరిగి మూడు రోజులు దాటినా పోలీసులు కారకులను అరెస్టు చేయలేదని విమర్శించారు. హోంమంత్రి తనయుడి హస్తం ఉంది కాబట్టే అరెస్టు చేయలేదని ఆరోపించారు. దాడికి నిరసనగా ఈ నెల 26న ర్యాలీలు, ఆందోళనలు, 27న శంకరరావు ఇంటి నుండి దాడి జరిగిన ప్రాంతం వరకు ర్యాలీ నిర్వహిస్తామన్నారు. శంకరరావుపై దాడికి నిరసనగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బషీర్ బాగ్ నుండి మంద కృష్ణ మాదిగ ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని పోలీసులు బషీర్ బాగ్ వద్దే అడ్డగించారు. మంద కృష్ణతో పాటు పలువురు మాదిగ హక్కుల పోరాట నేతలను పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి పోలీసు స్టేషన్ తరలించారు.