TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆ ముగ్గురికీ చిరంజీవి చెక్ పెట్టారా? 'మంచు' మీనింగ్ అదేనా?

Published on: Wed Feb 16, 2022 12:06PM

జ‌గ‌న్‌ను క‌లిసొచ్చాక మంచు విష్ణు సంచ‌ల‌న కామెంట్లు చేశారు. ఆ మాట‌ల వెనుక మ‌ర్మం ఏంట‌ని పెద్ద ఎత్తున‌ చ‌ర్చ న‌డుస్తోంది. ఇండ‌స్ట్రీలోనూ ఇంత రాజ‌కీయం ఉందా? అని అంతా అవాక్క‌వుతున్నారు. ఇటీవ‌ల సీఎం జ‌గ‌న్‌తో సినీ ప్రముఖుల భేటీకి మోహన్‌బాబును ఆహ్వానం పంపినా కొంతమంది ఆ సమాచారం నాన్నకు చేరకుండా ఆపేశారని అన్నారు మంచు విష్ణు. నాన్న‌తో పాటు మ‌రో ఇద్ద‌రు ముగ్గురు హీరోల‌నూ రాకుండా అడ్డుకున్నారంటూ కాంట్ర‌వ‌ర్సీ కామెంట్లు చేశారు. ఈ విష‌యం త‌న‌కు స్వ‌యంగా మంత్రి పేర్ని నానినే చెప్పార‌ని చెప్పారు. వారెవరు, ఎందుకు చేశారో త్వరలోనే తెలుస్తాయన్నారు. ఇంత‌కీ, మోహ‌న్‌బాబుతో పాటు మ‌రికొంద‌రు హీరోలకు ఆహ్వానాన్ని అడ్డుకున్నది ఎవ‌రు?

మొద‌టినుంచీ సీఎం జ‌గ‌న్‌తో సినిమా టికెట్ల ఇష్యూను నేరుగా డీల్ చేస్తున్న‌ది చిరంజీవినే. మొద‌ట్లో త‌న‌తో పాటు నాగార్జున‌, దిల్‌రాజు త‌దిత‌రుల‌ను వెంటేసుకుని వెళ్లేవారు. ఆ త‌ర్వాత స్ట్రాట‌జీ మార్చిన‌ట్టున్నారు. జ‌గ‌న్ ఫ్యామిలీతో చిరు దంప‌తులు సెప‌రేట్‌గా విందు భేటీ జ‌రిపారు. మ‌ళ్లీ ఇప్పుడు మ‌రో ఇద్ద‌రు హీరోల‌ను, ఇద్ద‌రు డైరెక్ట‌ర్ల‌తో క‌లిసి జ‌గ‌న్‌తో కీల‌క భేటీ జ‌రిపారు. అయితే, ఆ మీటింగ్‌కు వెళ్లేముందు.. త‌నొక్క‌డికే ఆహ్వానం వ‌చ్చింద‌ని చిరు అన‌డం.. ఆ త‌ర్వాత కొన్ని నిమిషాల‌కే ఒకే విమానంలో వారంతా క‌లిసి వెళ్ల‌డంపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. చిరంజీవి త‌న‌కు మాత్ర‌మే ఆహ్వానం ఉంద‌ని ఎందుక‌న్నారో ఆయ‌న‌కే తెలియాలి. ఇక ఆ భేటీకి జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా హాజ‌ర‌వుతార‌ని ఒక‌రోజు ముందునుంచే ప్ర‌చారం జ‌రిగింది. కానీ, మీటింగ్ స‌మ‌యానికి ఆయ‌న లేరు. ఇక ఆ భేటీకి మోహ‌న్‌బాబును ఎందుకు పిల‌వ‌లేదంటూ వివాదం రాజుకోవ‌డం.. మంత్రి పేర్నినాని మంచు ఇంటికెళ్లి మ‌రీ కూల్ చేయ‌డం.. లేటెస్ట్‌గా విష్ణు జ‌గ‌న‌న్న‌ను క‌ల‌వ‌డం జ‌రిగిపోయింది. మ‌రోవైపు, బాల‌కృష్ణ‌కూ తాడేప‌ల్లి ప్యాలెస్ నుంచి ఇన్విటేష‌న్ వ‌చ్చిందంటూ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇదంతా స‌రేగానీ.. మంచు విష్ణు మాట‌లపై ఇప్పుడు తీవ్ర చ‌ర్చ‌..ర‌చ్చ న‌డుస్తోంది. 

నిజంగానే, మోహ‌న్‌బాబుకు ఆహ్వానం రాకుండా అడ్డుకున్నారా?  విష్ణు చెప్పిన‌ట్టు మ‌రో ఇద్ద‌రు ముగ్గురు హీరోల‌కూ మోకాలు అడ్డుపెట్టారా? అయితే ఆ అడ్డుకున్న‌ది ఎవ‌రు? అంటే అంతా చిరంజీవి వైపే వేలెత్తి చూపుతున్నారు. ఎందుకంటే.. మొద‌టి నుంచీ ఈ ఇష్యూను డీల్ చేస్తూ.. క్రెడిట్ అంతా మెగాస్టారే కొట్టేస్తున్నార‌నే ఆరోప‌ణ ఉంది. టాలీవుడ్ పెద్ద‌గా గుర్తించ‌బ‌డ‌టానికే.. మా ఎన్నిక‌ల్లో జ‌రిగిన ప‌రాభ‌వం నుంచి బ‌య‌ట‌ప‌డి.. మ‌ళ్లీ ప‌రిశ్ర‌మ‌కు తానే దిక్కు-మొక్కు అనే మెసేజ్ ఇవ్వ‌డానికే.. కాస్త దిగ‌జారి మ‌రీ.. ఇలా జ‌గ‌న్‌తో డీల్ చేశార‌ని అంటున్నారు. అదే, చిరంజీవితో పాటు మోహ‌న్‌బాబునో, బాల‌కృష్ణ‌నో వ‌స్తే..? అప్పుడు క్రెడిట్ అంద‌రి ఖాతాల్లోకి వెళ్తుంది. అదంతా త‌న‌కే రావాలంటే.. త‌న స్థాయి వారు మ‌రెవ‌రూ ఆ మీటింగ్‌కు రాక‌పోతేనే సాధ్యం. అందుకే, ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఆ స‌మావేశానికి మోహ‌న్‌బాబు, నాగార్జున‌, బాల‌కృష్ణ‌, జూనియ‌ర్ ఎన్టీఆర్‌, సురేశ్‌బాబు, దిల్‌రాజు.. త‌దిత‌ర ప్ర‌ముఖుల‌కూ ఇన్విటేష‌న్ రెడీ చేసినా.. ఆ విష‌యం తెలిసి.. చిరంజీవినే ఆ ఆహ్వానాన్ని అడ్డుకున్నార‌ని.. చిరు సూచ‌న‌ల మేర‌కే ఆ జాబితా నుంచి మోహ‌న్‌బాబు, నాగ్‌, ఎన్‌బీకే, జూనియ‌ర్ త‌దిత‌రుల పేర్లు తొల‌గిపోయాయ‌ని మంచు వ‌ర్గాల నుంచి లీకులు వ‌స్తున్నాయి. బ‌హుషా అందుకే కాబోలు.. ఆ భేటీకి వ‌స్తారంటూ ఎన్టీఆర్ పేరు వినిపించినా ఆయ‌న రాలేదు. ఇక బాల‌య్య‌కు లేట్‌గా ఆహ్వానం వ‌చ్చింద‌ని తెలుస్తోంది. ఇక త‌ప్ప‌కుండా వెళ్లాల్సిన మోహ‌న్‌బాబును త‌ప్పించారు. అంత‌టికీ చిరంజీవీనే కార‌ణ‌మా? అంటున్నారు. మంచు విష్ణు చేసిన విమ‌ర్శ‌లు మెగాస్టార్‌ను ఉద్దేశించేన‌ని తెలుస్తోంది.