రాజకీయాల్లోకి మంచు మనోజ్..!!

మంచు మనోజ్.. మోహన్ బాబు తనయుడిగా వెండితెరకు పరిచయమైన మనోజ్.. హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా విభిన్న సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.. అయితే ఈ మధ్య మనోజ్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.. 'ఒక్కడు మిగిలాడు' సినిమా తరువాత ఏ సినిమా చేయలేదు.. దీంతో అసలు మనోజ్ ఇక సినిమాలు చేస్తాడా? లేదా ? అంటూ అనుమానాలు వ్యక్తమయ్యాయి.. అయితే ఇప్పుడు మనోజ్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది.. అదే మనోజ్ రాజకీయాల్లోకి వస్తున్నాడట.

 

 

మనోజ్ కి మొదటి నుండి సమాజం మీద, సేవల మీద దృష్టి ఎక్కువ.. సోషల్ మీడియా ద్వారా అందరికీ అందుబాటులో ఉంటాడు.. ఏదైనా సంఘటన జరిగితే వెంటనే స్పందిస్తాడు.. అసలు సినిమాల్లో కన్నా నార్మల్ గానే మనోజ్ కి మద్దతిచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువ.. అలాంటి మనోజ్ ఇప్పుడు రాజకీయాల్లోకి రాబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి.. టీడీపీలో చేరబోతున్నాడని కొందరంటే, జనసేనలో చేరబోతున్నాడని మరికొందరు అంటున్నారు.. ఇంకా కొందరైతే టీడీపీ తరుపున హైదరాబాద్లో ఎమ్మెల్యే పోటీ చేస్తాడని అంటున్నారు.. ఇప్పటికే నందమూరి కళ్యాణ్ రామ్ టీడీపీ తరుపున కూకట్ పల్లి, లేదా శేర్ లింగంపల్లి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటూ వార్తలొచ్చాయి.. ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి మనోజ్ అంటూ వార్తలు స్టార్ట్ అయ్యాయి.

 

 

మరి మనోజ్ నిజంగా రాజకీయాల్లోకి వస్తారో లేదో చూడాలి.. ఒకవేళ వస్తే టీడీపీలోకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. మంచు కుటుంబం మొదటి నుండి నందమూరి కుటుంబానికి సన్నిహితంగా ఉంటుంది.. అదీగాక మనోజ్, జూనియర్ ఎన్టీఆర్ కి మంచి ఫ్రెండ్.. అలాగే బాలకృష్ణతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి.. ఇవన్నీ పక్కన పెడితే.. అసలు మనోజ్ నిజంగానే సినిమాలకు దూరం అయ్యాడా? రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడా? ఇలాంటివి తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.. చూద్దాం ఏం జరుగుతుందో.